Viral Video: అంబులెన్సు కోసం ట్రాఫిక్ ఆపి మరి పంపించారు.. కానీ ఈ వీడియో చూడండి..

అది హైదరాబాద్ లో బిజీగా ఉండే నారాయణగూడ చౌరస్తా.  అప్పుడే రెడ్ సిగ్నల్ పడింది. కానీ అదే సమయంలో అంబులెన్సు సైరన్ మోగుకుంటూ వచ్చింది. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ మిగతా వాహనాలు ఆపి అంబులెన్సు పంపించాడు. అందులో రోగి ఉండడంతో మిగతా వాహనదారులు కూడా సహకరించారు. అయితే ఆ అంబులెన్సు కాస్తు ముందుకెళ్లి ఆగింది. గమనించిన కానిస్టేబుల్ వెంటనే అక్కడికి వెళ్లాడు.


అయితే అప్పటికే కిందికి అంబులెన్సు డ్రైవర్ రోడ్డు పక్క మిర్చి  బజ్జీ, కూల్ డ్రింక్ కొని తాగుతున్నాడు. కానిస్టేబుల్ అంబులెన్సు రోడ్డు పక్కన ఆపావు.. రోగి ఎక్కడని ప్రశ్నించగా.. రోగి లోపల ఉన్నట్లు చెప్పాడు. కానీ అంబులెన్సులో ఎవరు లేరు. అంబులెన్సు ముందు సీట్లో ఓ మహిళ కూర్చోని ఉంది. కానిస్టేబుల్ అంబులెన్సు డ్రైవర్ నిలదీశాడు. సైరన్ వేసుకుని వస్తే రోగి ఉన్నడు కావొచ్చని ట్రాఫిక్ ఆపి పంపించా.. అని చెప్పాడు. ఇదంతా కానిస్టేబుల్ సెల్ ఫోన్ లో రికార్డు చేశాడు. 


ఈ వీడియోను డీజీపీ అంజనీ కుమార్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అత్యవసర సమయాల్లో వినియోగించే సైరన్ దుర్వినియోగం చెయ్యొద్దని విజ్ఞప్తి చేశారు. ఇలా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక జారీ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు కూడా స్పందించారు. అంబులెన్సు దుర్వినియోగం చెయ్యొద్దని కోరారు.


కామెంట్‌లు