TTD: మార్చి 1 నుంచి తిరుమలలో ఫేసియల్ రికగ్నిషన్ వ్యవస్థ అమలు

 


తిరుమలలో నూతన వ్యవస్థను తీసుకురానున్నారు.ఇక నుంచి ఫేసియల్ రికగ్నిషన్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. దళారుల ప్రమేయం లేకుండా చేయడానికి ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకోస్తున్నామని టీటీడీ అధికారులు చెబుతున్నారు మార్చి1వ తేదీ నుంచి ఈ ఫేసియల్ రికగ్నిషన్ వ్యవస్థను అమలు చేయనున్నారు. ఇది ప్రస్తుతానికి ప్రయోగాత్మకమేనని. ఇది విజయవంతమైతే- మరింత విస్తృతం ఉపయోగిస్తామని అధికారులు తెలిపారు.

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు గదుల కేటాయింపు, లడ్డూ ప్రసాదం విక్రయాల్లో తొలిదశలో దీన్ని ప్రవేశపెడతామని చెప్పారు. తమ పేర్లతో మరొకరు గదులను బుక్ చేయడం, ఒకే వ్యక్తి అధిక సంఖ్యలో లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేయడాన్ని తగ్గించడానికి ఫేసియల్ రికగ్నిషన్ ను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు అధికారులు తెలిపారు.

కామెంట్‌లు