TSRTC: ఆర్టీసీ కార్మికులకు శుభవార్త.. త్వరలో జీతాలు పెంపు..

ఆర్టీసీ ఉద్యోగులక తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలోనే జీతాలు పెంచుతామని ప్రకటన చేసింది. ఉద్యోగుల జీతాలు పెంచాలని నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ కు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఛైర్మన్ గంప గోవర్ధన్ ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ నిర్ణయం తెలంగాణ మ

జ్దూర్ యూనియన్ ఆనందం వ్యక్తం చేసింది.  ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీతోపాటు డీఏ బకాయిలు రావాలి. అంతేకాక  2013 పీఆర్సీ 50 శాతం పెండింగ్‌లో ఉంది.  వాటికి బాండ్స్ జారీ చేశారు. పీఎఫ్ బకాయిలు, ఎస్ఆర్బీఎస్ నిధులు, సీసీఎస్ నుంచి వాడుకున్న నిధులను తిరిగి ఇవ్వాలని కార్మికులు కోరుతన్నారు. 


 రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,06,474 మంది పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను నెలకు తలా రూ.1,000 పెచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  జీవో నంబర్‌ 58, 59 కింద జంట నగరాల్లో పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడగించింది. ఇది ఎన్నికల ఏడాది కావడంతో ప్రభుత్వన ఈ నిర్ణయాలు తీసుకుంటుంది.


కామెంట్‌లు