నేచురల్ డ్రింక్ కల్లు ఎంతో కమ్మగుంటది. ఇలాంటి కల్లుతో హీరో దగ్గుబాటి రానాకు దావత్ ఇచ్చింది మై విలేజ్ షో టీం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రానా సమర్పణలో వసూద ఫేమ తిరువీర్ హీరో పరేషన్ సినిమా తీశారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్ర బృందం జగిత్యాల జిల్లాలో పర్యటించింది.
https://youtube.com/shorts/Nmon4ykIAuM?feature=share
వాల్తేర్ ప్రొడక్షన్స్‌పై సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాని జూన్ 2న తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. కల్లు తాగిన తర్వాత రానా ఏం చేశాడు.. ఈ వీడియోలో గంగవ్వ మాటలు, రానా సెటైర్స్ హైలెట్ గా నిలిచాయి. ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి.

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి