వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎస్సైని చెంప దెబ్బ కొట్టారు. ఆమె తన కారులో వెళ్తుండుగా పోలీసులు అడ్డుకున్నారు. ఎస్సై షర్మిల కారు డ్రైవర్ పట్ల దురుసుగా ప్రవర్తించి.. కారులోంచి బయటకు లాగాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన షర్మిల ఎస్సై చెంపను చెల్లుమనిపించారు. షర్మిల ఎస్సైని కొట్టే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పోలీసులపై దాడి చేయడంత ో వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఆమెను భర్త అనిల్ కమార్ పరామర్శించారు. అయితే షర్మిల బయటకు వెళ్తున్న ప్రతీ సారి పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో ఆమె తన ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు.
ఈ క్రమంలోనే సోమవారం ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో షర్మిల కోపంతో ఊగిపోయి ఎస్సై పై దాడి చేశారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి