నేచురల్ స్టార్ నాని, కిర్తీ సురేష్ కలిసి నటించిన మాస్ ఎంటర్ టైనర్ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించారు. ఈ సినిమా చిత్ర యూనిట్ భారీ అంచనాలు పెట్టుకుంది.ఈ సినిమా ఓటీటీ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడుపోయాయి. ఈ సినిమా గురువారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు నాని భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
కాగా సినిమా విడుదలకు ముందు మంచు లక్ష్మి ఫేస్ బుక్ లో వీడియో పోస్ట్ పెట్టారు. ఈ వీడియోలో దసరా సినిమాలోని ఓ వదినే పాటకు మంచు లక్ష్మి డ్యాన్స్ చేశారు. మధ్యలో ఓ చిన్నారి కూడా డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లక్ష్మి వీడియోతో పాటు దసరా సినిమా విజయవంతం కావాలని కోరుకున్నారు. వీడియో కోసం క్లిక్ చేయండి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి