Tollywood: తండ్రి ఒక్కడే కానీ.. తల్లులు ఇద్దరు..!

టాలీవుడ్ లో కొంత మంది హీరోలు రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. వారి తనయులు ప్రస్తుతం సినిమా రంగంలో రాణిస్తున్నారు. వారి ఇద్దరి భార్యల.. పిల్లలు ఇండస్ట్రిలో తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వారి తండ్రి ఒకరే అయిన తల్లులు ఇద్దరు ఉన్నారు. ఇలా తండ్రి ఒక్కడు తల్లులిద్దరు ఉన్నవారిలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నాగచైతన్య, అఖిల్, మహేష్ బాబు, నరేష్, మంచు విష్ణు, మంచు లక్ష్మి, మంచు మనోజ్  వంటి వారు ఉన్నారు. 

మోహన్  బాబుకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఇందులో విష్ణు, లక్ష్మి మోహన్ బాబు మొదటి భార్య విద్యా దేవి సంతానం. మనోజ్ రెండో భార్య నిర్మల కుమారుడు.  నాగార్జునకు ఇద్దరు కొడుకులు కాగా.. నాగ చైతన్య నాగార్జున మొదటి భార్య లక్ష్మి కుమారుడు.. రెండో భార్య అమల కొడుకు అఖిల్.  సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య కుమారుడు మహేష్ బాబు కాగా.. రెండో భార్య విజయనిర్మల కొడుకు నరేష్. అయితే విజయ నిర్మలకు నరేష్ జన్మించిన తర్వాతే కృష్ణను వివాహం చేసుకున్నారు.

నందమూరి హరికృష్ణ మొదటి భార్య కొడుకులు కళ్యాణ్ రామ్, జానకి రామ్ కాగా.. రెండో భార్యకు  జూ.ఎన్టీఆర్ జన్మించాడు.  హీరోయిన్స్ నగ్మా, జ్యోతికలకు తండ్రి ఒక్కడే కానీ తల్లులు ఇద్దరు ఉన్నారు.  సీనియర్ నటుడు విజయ్ కుమార్ ఇద్దరు భార్యాలు కాగా.. మొదటి భార్య కూతురు అరుణ కాగా రెండో భార్య కూతురు శ్రీదేవి.బోనీ కపూర్ మొదటి భార్యకు అర్జున్ కపూర్.. రెండో భార్య శ్రీదేవికి జాన్వీ, ఖుషీ పుట్టారు.  సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య అమృతా సింగ్‌కు సారా, అబ్రహాం పుడితే.. కరీనా, సైఫ్ జంటకు తైమూర్ తో పాటు మరో కుమారుడు పుట్టారు.





కామెంట్‌లు