బలంగం సినిమాకు బడ్జెట్ చిన్నదైనా.. భావం మాత్రం ఎక్కవే.. ఇది ఫ్యామిలీ మొత్తంతో కలిసి చూడాల్సిన సినిమా. ఈ సినిమా పేద, మధ్యతరగతి జీవితాలను తెరపై చూపించింది. ముఖ్యంగా ఒక తల్లి కడుపులో పుట్టిన పిల్లలు కలిసి ఉంటే ఎలా ఉంటుందో ఈ సినిమా చూపిస్తుంది.
చాలా మంది వృద్ధాప్యంలో కొడుకులు, కూతుళ్ల గురించి బాధపడుతుంటారు. ఆస్తుల కోసం కొడుకులు కొట్టుకుంటే చూడలేని తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వారి ఆత్మ శాంతించదు. ఈ సినిమాలో అదే చూపెడతారు. ఈ సినిమా ఒక్క పల్లెటూరులోని ఒక కుటుంబం గురించి చక్కగా వివరిస్తుంది.
ఈ సినిమా చివరిలో యాక్షగానం చేసే కళాకారులు పాడిన పాట ప్రతి ఒక్కరికి కన్నీటిని తెప్పిస్తుంది. పెద్దొడ ఐలయ్య ఐలయ్య నినేళ్లిపోతున్న ఐలయ్య అంటూ వారు పాడిన పాట ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతుంది.
ఈ సినిమాలోని రెండు పాటలు చాలా బాగుంటాయి. ఒక పాట పల్లె గురించి చెబితే.. మరో పాట మన చివరి మజిలి గురించి వివస్తుంది. బలరామ నర్సయో బలరామ నర్సయో అనుకుంటూ వచ్చే పాట.. మనం చివరికి తీసుకుపోయేది ఏమి లేదని చెబుతుంది. ఫైనల్ గా ఈ సినిమా ఒక సమాజిక స్పృహాను, అలాగే బంధాలను గుర్తు చేస్తుంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి