క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. దాదాపు 50 మంది పోలీసులు బొడుప్పల్ లోని క్యూ న్యూస్ ఆఫీస్ చేరుకుని మల్లన్నను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆఫీస్ లో పనిచేసే వారిని బయటకు పంపించి మల్లన్నను అరెస్ట్ చేయడమే కాకుండా.. సోదాలు కూడా చేస్తున్నట్లు తెలిసింది.
గతంలో కూడా పోలీసులు క్యూ న్యూస్ ఆఫీస్ లో సోదాలు చేశారు. తీన్మార్ మల్లన్న ఇంతకు ముందు అరెస్ట్ దాదాపు 2 నెలలకు పైగా జైలులో ఉన్నారు. శాటిలైట్ ఛానెళ్లు, న్యూస్ పేపర్లు ప్రభుత్వానికి లొంగిపోయి పని చేస్తున్న వేళ తీన్మార్ మల్లన్న ప్రజల గొంతుగా క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానెల్ తీసుకొచ్చారు.
ఈ ఛానెల్ ను కూడా మూయించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు మల్లన్న ఆరోపించారు. క్యూ న్యూస్ చూడకుండా ఉండడానికి ప్రత్యేక టీంను ఏర్పాటు చేసినట్లు మల్లన్న చెప్పారు. మరో వైపు ఢిల్లీలో కవితను ఈడీ విచారించింది. లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికే చాలా మందిని ఈడీ అరెస్ట్ చేసింది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి