Vaishnav Tej: వైరల్ అవుతోన్న వైష్ణవ్ తేజ్,సుస్మిత కొనిదేల ఫొటో

సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఈ ఫొటోల మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతరు సుస్మిత, మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉన్నారు. అయితే ఇది ఒక్క ఫొటో కాదు.. రెండు ఫొటోలు కలిపి ఉన్న ఫొటో. ఇందులో వైష్ణవ్ తేజ్ చిన్న వయస్సులో ఉన్నప్పుడు అతన్ని సుస్మిత ఎత్తుకుంది. తాజాగా వైష్ణవ్ పెద్ద అయ్యాక సుస్మిత తేజ్ ను పిల్లాడిలో ఎత్తుకున్నారు. ఈ రెండు ఫొటోలు కలిపి ఓ ఫొటో తయారి చేసి మెగాస్టార్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుస్మిత పలు సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్ గా వ్యవహరించారు. 

సుస్మిత 1982 మార్చి 3న జన్మించారు. ఆమె 2006లో విష్ణ్ ప్రసాద్ ను పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ కు సుస్మితను ఇచ్చి పెళ్లి చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ పెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకు వ్యక్తిగత కారణాలతో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారు. మెగాస్టార్  చిరంజీవికి కొడుకు రాం చరణ్, కూతుళ్లు సుస్మిత, శ్రీజ ఉన్నారు. శ్రీజ అప్పట్లో ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత వారికి ఓ పాప జన్మించింది. తర్వాత శ్రీజ విడాకులు తీసుకుని మరొకరిని పెళ్లి చేసుకున్నారు. 


కామెంట్‌లు