వీర్యం దానం చేసి ఓ వైద్యుడు 550 మందికి తండ్రి అయ్యాడు. అయితే అతన్ని ఇక వీర్యం దానం చేయకుండా అడ్డుకోవాలని ఓ స్వచ్ఛంద సంస్థతో పాటు, ఆ వైద్యుడు వీర్య దానం ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన మహిళ కూడా కోర్టుకు వెళ్లారు. నెదర్లాండ్ కు చెందిన 41 ఏళ్ల వైద్యుజు జోనాథన్ వీర్యం దానం చేయడం ద్వారా 550 పిల్లలకు తండ్రి అయ్యాడు. అతన్ని ఇలానే విడిచి పెడితే చాలా మందికి తండ్రి అయ్యే అవకాశం ఉందని ఆ మహిళ ఆరోపించింది.
2017లో జోనాథన్ వీర్య దానం ద్వారా 102 మందికి తండ్రయ్యాడు. దీంతో నెదర్లాండ్స్ ఇతను వీర్యం దానం చేయకుండా నిషేధించారు. కానీ అతను ప్రపంచ వ్యాప్తంగా వీర్యం దానం చేస్తు ఏకంగా 550 మంది నాన్న అయ్యాడు. నిబంధన ప్రకారం ఓ వ్యక్తి 25 మంది పిల్లల కంటే ఎక్కువ మంది పుట్టేందుకు వీర్యం దానం చేయకూడదు. లేదా 12 మంది కంటే ఎక్కువ మందికి గర్భం దాల్చడానికి వీర్యం దానం చేయకూడదు. అతను ఈ నిబంధన అతిక్రమించాడు. జోనాథ్ నెదర్లాండ్ తోపాటు ప్రపంచ వ్యాప్తంగా 13 క్లీనిక్ ల్లో వీర్యం దానం చేశాడు.

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి