తెలుగు సినీ పరిశ్రమలో హాస్యానికి పెట్టింది పేరుగా ఉన్న ఒకే ఒక వ్యక్తి బ్రహ్మనందం. లెక్చర్ గా తన జీవితాన్ని మొదలు పెట్టి కామెడియన్ గా స్థిరపడిన బ్రహ్మనందం పుట్టిన రోజున ఆయనకు మెగాస్టార్ చిరంజీవి సర్ ప్రైస్ ఇచ్చారు. ఏకంగా ఇంటికి వెళ్లి బ్రహ్మనందానికి శుభకాంక్షలు తెలిపారు. అనంతరం చిరు ట్వీట్ కూడా చేశారు.
"నాకు తెలిసిన బ్రహ్మనందం అత్తిలిలో ఓ లెక్చరర్. ఈ రోజు బ్రహ్మనందం ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కెక్కిన ఒక గొప్ప హాస్య నటుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. కామెడీకి నిలువెత్తు నిదర్శనం. అతను కామెడీ చేయనక్కర్లేదు. అతని మొహం చూస్తేనే హాస్యం వెల్లివిరుస్తుంది. పొట్ట చెక్కలవుతుంది. ఇలాంటి బ్రహ్మనందానికి హృదయపూర్వక శుభాభినందనలు" అని ట్వీట్ చేశాడు.
బ్రహ్మనందం ఇలాగే జీవితాంతం నవ్వుతూ, పదిమందిని నవ్విస్తూ ఉండాలని, బ్రహ్మనందంకు మరింత బ్రహ్మండమైన భవిష్యత్ ఉండాలని, తన పరిపూర్ణ జీవితం ఇలాగే బ్రహ్మనందకరంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ తనకి నా జన్మదిన శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు. ట్వీట్ కోసం ఇక్కడ..



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి