రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నవీన్ హత్య రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. తన ప్రేమకు నవీన్ అడ్డు వస్తున్నాడనే హరిహరకృష్ణ ఈ ఘాతుకానికి పాల్పడ్డు. హరిహరకృష్ణ నవీన్ హత్య చేసేందుకు 3 నెలల ముందే కుట్రపన్నాడు. 2 నెలల క్రితం మలక్ పేటలోని ఓ సూపర్ మార్కెట్‌లో హరిహరకృష్ణ కత్తి కొనుగోలు చేశాడు. ఈ నెల 16 నవీన్ హైదరాబద్ రావాల్సిందిగా హరిహరకృష్ణ ఫోన్ చేశాడు.
17న వారిద్దరు కలిసి దిచక్ర వాహనంపై నల్గొండ పైపు వచ్చారు. పెద్దఅంబర్ పేటలోని వైన్స్ మద్యం కొనుగోలు చేసి తాగారు. ఆ తర్వాత అబ్దుల్లాపూర్ మెట్ ఓ నిర్మానుష్య ప్రాంతానికి మద్యం మత్తులో అమ్మాయి గురించి వారి మధ్య గొడవ జరిగింది. హరిహరకృష్ణ నవీన్ గొంతు నులిమి హత్య చేశాడు. హత్య తర్వాత నవీన్ శరీరాన్ని హరిహరకృష్ణ ముక్కలు చేశాడు.
తల, వేళ్లు, ఇతర భాగాలు బ్యాగులో వేసుకొని అక్కడ నుంచి వెళ్లిపోయాడు. బ్రాహ్మణపల్లి వద్ద నవీన్ అవయవాలు పడేశాడు. ఆ తర్వాత స్నేహితుడు హసన్ ఇంటికి వెళ్లాడు. అక్కడ స్నానం చేసి హత్య చేసిన విషయాన్ని హసన్ కు చెప్పాడు. మరుసటిరోజు ప్రియురాలికి హత్య విషయం చెప్పాడు. ఆ తర్వాత వరంగల్, కోదాడ, ఖమ్మం, విశాఖకు వెళ్లాడు. ఈనెల 24న మరోసారి హత్య చేసిన స్థలానికి వెళ్లాడు.
మిగిలిన శరీర భాగాలు సేకరించి దహనం చేసిన అనంతరం పోలీసుల ముందు లొంగిపోయాడు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి