SSY: మీ ఇంట్లో ఆడ పిల్లలున్నారా.. అయితే ఈ ఖాతా తెరవండి.. డబ్బులే డబ్బులు.!



చాలా మంది ఆడ పిల్ల పుట్టగానే ఏదో జరిగిపోయినట్లు ఫీలావుతారు. ఎవరైనా ఒకటే అని తెలుసుకోరు. ఒక్కప్పుడు ఇలా ఫీలావడం ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా మంది మారిపోయారు. కానీ ఆడ పిల్లంటే పెళ్లి చేయాలి, కట్నం ఇవ్వాలని ఫీలాయ్యే వారు ఇప్పుడు కూడా ఉన్నారు. అయితే అలాంటి ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఒక పథకం తీసుకొచ్చింది. అదే సుకన్య సమృద్ధి యోజన. ఈ పథకం కేవలం ఆడి పిల్లలకు మాత్రమే..

ఇది అత్యంత సురక్షితమైన ప్రభుత్వ పెట్టుబడి పథకం. మీకు ఆడ పిల్లలు వెంటనే మీ దగ్గరలోని పోస్టాఫీస్ కు వెళ్లి సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవొచ్చు. లేదా బ్యాంకు లో కూడా ఖాతా తెరవచ్చు.  ఖాతాలో సంవత్సరానికి కనీసం రూ.250 డిపాజిట్ చేయాలి. గరిష్ఠంగా లక్ష 50 వేల వరకు పొదుపు చేసుకోవచ్చు. ఈ  పథకం కింద మీరు 15 ఏళ్ల మాత్రమే ప్రీమియం చెల్లిస్తే చాలు.. 21 ఏళ్ల తర్వాత వడ్డీ, అస్సలు కలిపి ఖాతాదారురాలి ఖాతాలో జమ అవుతుంది. 18 ఏళ్ల వయస్సులో విద్య కోసం 50శాతం పొదుపు చేసిన సొమ్ము ను పొందవచ్చు.

ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజనలో 7.6 శాతం వడ్డీ అందిస్తున్నారు. మీరు ఈ కూతురు 2 ఏళ్లు ఉన్నప్పుడు పథకంలో చేరితే 15 ఏళ్ల పాటు సంవత్సరానికి రూ.1.50 వేలు ప్రీమియం చెల్లిస్తారు.  మీకు 21 ఏళ్ల తర్వాత మీరు కట్టిన రూ. 22,50,000 వేలకు రూ.19,98,000 వడ్డీతో పాటు మొత్తం రూ.42,48,000 వస్తాయి.


కామెంట్‌లు