TurkyEarthQuake: తల్లి గర్భం నుంచి శిథిలాల్లోకి.. హృదయాన్ని కదిలిస్తున్న టర్కీ దృశ్యాలు..



భారీ ప్రకృతి విపత్తుతో టర్కీ విలపిస్తోంది. ప్రపంచ దేశాల ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది. భారీ భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన టర్కీలో ఎన్నో దృశ్యాలు హృదయాన్ని కదిలిస్తోంది. భవన శిథిలాల శిశువును నుంచి రక్షించిన దృశ్యం ప్రతి ఒక్కరిని కదిలించింది. శిథిలాల కింద ఓ గర్భవతి చిక్కుకుని శిశువుకు జన్మనిచ్చింది. ఆదే సమయంలో ఆమె మరణించింది. శిశువు బొడ్డు తాడుతో తల్లికి పట్టుకుని ఉంది. ఈ విషాదకర ఘటన ప్రతీ ఒక్కరి హృదయాన్ని కలిచివేసింది. "మేము త్రవ్వినప్పుడు మాకు ఒక వాయిస్ వినిపించింది.మేము దుమ్మును క్లియర్ చేశాం.బొడ్డు తాడు (చెదురుగా) ఉన్న శిశువును కనుగొన్నాము. బొడ్డు పేగును  కత్తిరించి శిశువును బయటకు ఆసుపత్రికి తరలించాం" అని ఓ అధికారి తెలిపారు. పసికందు ఆమె కుటుంబంలో అందురు మరణించారని.. ఆ శిశువు కుటుంబానికి చెందిన ఏకైక వ్యక్తిగా మిలిగిపోయాడు.


కామెంట్‌లు