టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కె విశ్వనాథ్( 92) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. విశ్వనాథ్ మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సినీ ఇండస్ట్రీకి ఎంత సేవ చేశారని కొనియాడారు.
ఏపీ సీఎం జగన్ విశ్వనాథ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. విశ్వనాథ్‌గారి మరణం తీవ్రవిచారానికి గురిచేసింది. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్‌గారు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీరంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయి. తెలుగువారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి