2018 బీఆర్ఎస్ ప్రధాన హామీల్లో రైతు రుణ మాఫీ ఒక్కటి. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ లక్ష రూపాయలలోపు రైతు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక.. మొదటగా రూ.25 వేలకు మాఫీ చేసింది. ఆ తర్వాత రూ.50 వేలకు వరకు మాఫీ చేస్తామని చెప్పింది. తాజాగా రూ.90 వేల వరకు రుణ మాఫీ చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు.
అయితే ఇంతవరకు రూ.50 వేల వరకు కూడా పూర్తిగా రుణ మాఫీ కాలేదు. రైతు రుణ మాఫీ కోసం అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు రూ.35 వేల లోపు మాత్రమే రుణ మాఫీ అయింది. దీంతో 7.27 లక్షల మంది రైతులకు మాత్రమే లబ్ధీ చేకురింది. రైతు రుణ మాఫీ కావాలంటే.. రూ.21,556 కోట్లు కావాలని అంచనా వేశారు. కానీ ప్రభుత్వం నాలుగేళ్లలో 1100 కోట్లు మాత్రమే విడుదల చేసింది. తాజాగా రూ.6,385 కోట్లు కేటాయించారు. ఇప్పుడు కూడా రూ.90 వేల లోపు మాఫీ చేస్తామని చెప్పారు.
లక్ష లోపు రుణ మాఫీ ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. ప్రస్తుతమున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్టే చివరిది. అంటే వారికి మరో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేదు. అంటే.. లక్షలోపు రుణమాఫీ సాధ్యం కాదని తెలుస్తోంది. సో.. నిరుద్యోగ భృతి లాగానే.. రైతు రుణ మాఫీ కూడా ఉత్త ముచ్చటే..!

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి