నందమూరి తారకరత్న కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. తారకరత్న బెంగుళూరులోని నారాయణా హృదయాలయ ఆస్పత్రిలో 23 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం రాత్రి ఆయన కన్నుమూశారు. జనవరి 26న టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. ఆయన్ను మొదటగా కుప్పంలోని ఓ ఆస్పత్రికి తరలించి.. అక్కడ నుంచి బెంగళూరుకు తరలించారు.
ఎన్టీఆర్ కుమారడు మోహన్‌కృష్ణ తనయుడే తారకరత్న. 1983 ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లో తారకరత్న జన్మించారు. అలేఖ్య రెడ్డిని 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 20 ఏళ్ల వయసులోనే కథానాయకుడిగా తారకరత్న సినిమాలోకి అడుకు పెట్టాడు.
2002లో విడుదలైన ‘ఒకటో నెంబర్ కుర్రాడు’తో ఆయన సినిమాల్లోకి మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. యువరత్న, భద్రాద్రి రాముడు, అమరావతి, నందీశ్వరుడు వంటి చిత్రాల్లో ఆయన హీరోగా నటించారు. ఈ మధ్య వెబ్ సిరీస్ ల్లో కూడా నటించారు.
బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు. నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగులు చప్పుడు ఆగిపోయింది. నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. నిష్కల్మషమైన నీ ప్రేమ, స్నేహ బంధం మన బంధుత్వం కంటే గొప్పది. తారకరత్నకి కన్నీటి నివాళులతో..
...నారా లోకేష్
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి
తారక రత్న మృతదేహాన్ని రేపు ఉదయానికి మోకిల లోని తన నివాసానికి తరలిస్తారు. ఎల్లుండి (సోమవారం) ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
సినీ నటుడు, ఎన్టీఆర్ మనవడు నందమూరి తారకరత్నమృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిసంతాపం వ్యక్తం చేశారు.
నందమూరి వారసులు, ప్రముఖ సినీ నటులు నందమూరి తారక రత్న మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తారకరత్న మరణ వార్త నన్ను చాలా కలచివేసింది.
ప్రముఖ హీరో నందమూరి తారకరత్న మృతి
ప్రముఖ హీరో నందమూరి తారకరత్న గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. గుండెపోటు కారణంగా ఆరోగ్యం పాడైన ఆయన బెంగళూరులోని నారాయణ హృదయాలలో చికిత్స పొందుతున్నారు.
ఇక, తారకరత్న ఎన్టీఆర్ వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. 'ఒకటో నెంబర్ కుర్రాడు'తో ఓ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. 2002లో తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన ఇప్పటివరకు దాదాపుగా 23 సినిమాల్లో నటించారు. అమరావతి సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించారు. సైకో పాత్రలో అద్భుతంగా నటించారు. అమరావతి సినిమాలో ఆయన నటనకు గాను నంది అవార్డును సొంతం చేసుకున్నారు. విజయసాయిరెడ్డి భార్య చెల్లెలి కూతుర్ని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. అయితే, మధ్యలో కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరం అయ్యారు. 2022లో '9 అవర్స్' అనే ఓ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ వెబ్ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
బాల బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచే మా తారకరత్న పిలుపు ఇక వినబడదని ఊహించుకోవడాన్నే తట్టుకోలేకపోతున్నా. నందమూరి అభిమానులకు, టిడిపి కుటుంబ సభ్యులకు తారకరత్న మరణం తీరని లోటు. నటనలోనూ తనకు తాను నిరూపించుకున్నాడు. కఠోరంగా మృత్యువుతో పోరాడుతున్నప్పుడు మృత్యుంజయుడై తిరిగి వస్తాడు అనుకున్న తారకరత్న ఇక కానరాని లోకాలకు వెళ్ళాడు. తారతరత్న ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి