Save Journalism: జర్నలిజం బతికుందా..!

 ఒకప్పుడు మీడియా అంటే ఎంతో గౌరవం ఉండేది. మీడియాకు చాలా మంది భయపడే వారు. జర్నలిస్టులు కూడా అంతే నిజాయతీగా ఉండేవాళ్లు.. కానీ ఇప్పుడు కాలం మారింది.. ప్రతీ పార్టీకి సొంత మీడియా హౌస్ లు ఉన్నాయి. ఇదే సమయంలో జర్నలిస్టులు కూడా మారిపోయారు. విలువల కంటే డబ్బే ప్రధానంగా పని చేస్తున్నారు. అయితే ఇప్పటికీ నిజాయతీగా పని చేసే వారు ఉన్నారు. వారు తమకు డబ్బు లేకపోయినా.. నీతి, నిజాయతీతో పని చేస్తున్నారు.


ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రావడం మీడియా గడి తప్పడం ప్రారంభించింది.  అయితే రాజశేఖర్ రెడ్డి మీడియా హౌస్ ప్రారంభించడాని కారణం లేకపోలేదు. అప్పుడున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి కాస్త టీడీపీకి మద్దతుగా వ్యవరించడంతో రాజశేఖర్ రెడ్డికి సొంత మీడియా అవసరమొచ్చింది. రాజశేఖర్ రెడ్డి సాక్షి మీడియా హౌస్ ప్రారంభించడానికి ముందు వార్త పత్రిక సహాయం తీసుకున్నారు. అందుకు ప్రతిఫలంగా వార్త అధినేతకు రాజ్యసభ సీటు కూడా ఇచ్చారు.




తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మీడియా మరింత దిగజారిపోయిందని చెప్పొచ్చు. దీని అర్థం అన్ని మీడియా  హౌస్ దిగజారయ్యాని కాదు. కేవలం కొన్ని సంస్థల వల్ల మీడియా మొత్తనికి చెడ్డ పేరు వచ్చింది. రాష్ట్రం రాకముందు కేసీఆర్ టీ న్యూస్  తో పాటు నమస్తే తెలంగాణ పత్రికను ప్రారంభించారు. అధికారంలోకి వచ్చాక రూట్ మార్చారు. 

తన దగ్గరి వాళ్లతో ప్రముఖ న్యూస్ ఛానళ్లను కొనుగోలు చేయించారు. ప్రభుత్వానికి వ్యతరేకంగా వార్తలు రాసే మీడియాను లొంగదీసుకునే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలా కాని పక్షంలో దాన్ని మూయించేలా చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇలా తెలంగాణ మీడియాను గుప్పిట పెట్టుకునే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే అదే సమయంలో సోషల్ మీడియా ప్రభావంతంగా పని చేయడం ప్రారంభించింది.

అయితే వాటిని కూడా కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేశారు. కొన్నింటిని కొనుగోలు చేశారు. అయితే ఈ మధ్య బీజేపీ పుంజుకోవడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం కాస్త ఇబ్బందుల్లో పడింది. ఇన్ని రోజులు తమ గుప్పిట్లో ఉన్న మీడియా హౌస్ లో ఇతర పక్షాల వార్తలను కూడా చూపించడం మొదలు పెట్టాయి. దానికి కారణం ఈ మీడియా యజమానులపై ఐటీతో దాడి చేస్తారనే భయంతో  ప్రభుత్వ వ్యతిరేక వార్తలను కూడా వేస్తున్నారు.

ఏదీ ఏమైనా ఇప్పటికి సిద్ధాంతాన్ని నమ్ముకుని పని చేస్తున్న జర్నలిస్టులు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం వారు జీవితాలు అగమ్యగోచరంగా ఉన్నాయి. చాలిచాలని జీతాలతో వారు జీవితాలను నెట్టుకొస్తున్నారు. వారిని ఆదుకునేందుకు ఏ ప్రభుత్వాలు కూడా ముందుకు రావడం లేదు. 

Note: ఈ వార్త ఎవరిని  ఉద్దేశించింది కాదు.. కేవలం ప్రస్తుతం ఉన్న పరిస్థితిని తెలియజేయడమే..

కామెంట్‌లు