సురక్షితమైన పెట్టుబడి పథకాల్లో పీపీఎఫ్ ఒకటి. ఇది ప్రభుత్వ పథకం. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ పీపీఎప్ ఖాతాను ఏదైనా బ్యాంకులో లేదా పోస్టాఫీస్ లో తెరవొచ్చు. ఈ పథకంలో వచ్చే వడ్డీ కూడా ఆకర్షణీయంగా ఉంది. ఈ పథకంలో ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ అందిస్తున్నారు.
అయితే ఈ పథకానికి మెచ్యూరిటీ పీరియడ్ ఉంది. ఈ పథకానికి 15 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్. మధ్యలో పీపీఎఫ్ ఫండ్ నుంచి లోన్ తీసుకోవచ్చు. కానీ PPF ఖాతా తెరిచిన వెంటనే మీరు రుణం తీసుకోలేరు. ఖాతా తెరిచిన 3వ సంవత్సరం నుండి 6వ సంవత్సరం మధ్య రుణం తీసుకోవచ్చు. పీపీఎఫ్‌పై తీసుకున్న రుణం మొత్తంపై మీరు ఒక శాతం వడ్డీని చెల్లించాలి. అయితే 36 నెలలలోపు PPF లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించే వినియోగదారులకు ఒక శాతం వడ్డీ రేటు ఉంటుంది. 36 నెలల తర్వాత రుణ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తే, వడ్డీ రేటు సంవత్సరానికి 6 శాతం ఉంటుంది.
పీపీఎఫ్ పథకంలో మీరు నెలకు రూ.12,500 పెట్టుబడి పెడితే మొత్తం రూ.1.5లక్షలు అవుతాయి. 15 ఏళ్లలో మీరు రూ.22 లక్షల 50 వేలు పెట్టుబడి పెడతారు. ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం ఈ మొత్తం పై మీకు రూ.18.18 లక్షల వడ్డీ వస్తుంది. అంటే మీకు మొత్తంగా మీకు రూ.40 లక్షలకు పైగా డబ్బులు వస్తాయి.
15 సంవత్సరాల తర్వాత మీరు పెట్టుబడి పొడిగించాలనుకుంటే 5 సంవత్సరాల చొప్పున పొడిగించుకోవచ్చు. ఇలా 35 సంవత్సరల వరకు మీరు పెట్టుబడి పెడితే మీకు 7.10 శాతం వడ్డితో రూ.2,26,97,857 పొందే అవకాశం ఉంటుంది. అయితే పీపీఎఫ్ ఒక్క ఏడాదిలో కనీసం రూ.500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. లేకుంటే అకౌంట్ డియాక్టివ్ అవుతుంది. పీపీఎఫ్ ఖాతా పిల్లల పేరును కూడా తెరవొచ్చు. అయితే ఒక్కరు ఒక్క ఖాతా తీయడానికి మాత్రమే హర్హులు. భారతీయులు మాత్రమే ఈ ఖాత తెరవొచ్చు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి