బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిసున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ఢిల్లీ వెళ్లిన ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో కలుసుకున్నారు. బీజేపీ ఎంపీలు బండి సంజయ్, సోయం బాపురావు, ధర్మపురి అర్వింద్ వస్తుండగా.. రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. రేవంత్ ను చూసి బీజేపీ ఎంపీలు ఆగారు. అనంతరం బండి సంజయ్, రేవంత్ రెడ్డి షేకండ్ ఇచ్చిపుచ్చుకున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోను బీఆర్ఎస్ చెందిన సోషల్ మీడియా విభాగం వారు ట్రోల్ చేస్తున్నారు. అయితే ఏ రాజకీయ నాయకుడైనా.. ఎదుటి నాయకుడికి గౌరవం ఇవ్వాలి. అది మన సంప్రదాయం. అలాగే కోపాలు, ద్వేషాలు కింది స్థాయి కార్యకర్తల్లో ఉంటాయి తప్పా.. నాయకుల్లో ఉండవు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి