13 ఏళ్ల భారతీ
య-అమెరికన్ నటాషా పెరియనాయగం ప్రపంచంలో తెలివైన విద్యార్థుల జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ చిన్నారి తాను చదివే తరగతి కంటే పై గ్రేడ్ స్థాయి ప్రశ్నలకు కూడా చెప్పి వివిధ దేశాల విద్యార్థులతో పరీక్షల్లో పోటీ పడి టాప్‌లో నిలిచింది. న్యూజెర్సీలోని ఫ్లోరెన్స్ ఎమ్ గౌడినీర్ మిడిల్ స్కూల్‌లో చదువుతున్న నటాషా.. జాన్స్ హాప్‌కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ నిర్వహించిన పరీక్షల్లో ప్రతిభ కనభరచి ప్రపంచంలో తెలివైన విద్యార్థుల జాబితాలో స్థానం దక్కించుకుంది.
2.
వెర్బల్, క్వాంటిటేటివ్ విభాగాల్లో 90 పర్సంటైల్
గతంలోనూ నటాషా ఈ పరీక్షల్లో సత్తా చాటింది. వెర్బల్, క్వాంటిటేటివ్ విభాగాల్లో 90 పర్సంటైల్ స్కోర్ చేసింది. 8వ గ్రేడ్ విద్యార్థిని స్థాయి ప్రతిభ కనబర్చడం ద్వారా టాపర్ల జాబితాలో చోటు దక్కించుకొంది. అదేవిధంగా ఈ సంవత్సరం నిర్వహించిన పరీక్షల్లోనూ ఆమె మిగిలిన అందరు విద్యార్థుల కంటే ఎక్కువ స్కోర్ చేసింది. ఎస్‌ఏటీ, ఏసీటీ పరీక్షల్లో నటాషా చక్కటి స్కోర్ చేసి ప్రథమ స్థానంలో నిలిచిందని సీటీవై టాలెంట్ సెర్చ్ విభాగం సోమవారం ప్రకటించింది.
3.
15,300 మంది విద్యార్థులు
ఈ పరీక్షల్లో 76 దేశాలకు చెందిన 15,300 మంది విద్యార్థులు ప్రస్తుతం తాము చదువుతున్న తరగతి కంటే పైగ్రేడ్ స్థాయిలో 2021-22లో నిర్వహించిన పరీక్షల్లో పాల్గొన్నారు. వారిలో 27 శాతం కంటే తక్కువ మంది మాత్రమే అర్హత సాధించారు. "నా తల్లిదండ్రులు దాని గురించి సంతోషంగా ఉన్నారని, మా అక్క కూడా సంతోషంగా ఉన్నారని నాకు తెలుసు" అని Ms పెరియనాయగం PTI కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
4.
న్యూజెర్సీ
నటాషా తల్లిదండ్రులు అమెరికా వెళ్లి న్యూజెర్సీలో స్థిరపడ్డారు. తల్లిదండ్రులు పరీక్షలు రాయమని బలవంతం చేయలేదని నటాషా చెప్పింది. తనలపై ఎటువంటి ఒత్తిడి లేదని చెప్పారు. తను 5వ తరగతి విద్యార్థిగా ఉన్నప్పుడు 2021 వసంతకాలంలో జాన్స్ హాప్‌కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ (CTY) పరీక్షకు హాజరయ్యానని, 2022లో తదుపరి స్థాయికి పరీక్ష రాయడానికి తనను ఇది ప్రేరణగా నిలిచిందని పేర్కొన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి