Amigos: అమిగోస్ సినిమా ఎలా ఉందంటే..!


నందమూరి కల్యాణ్ రామ్ త్రిపాత్ర అభినయం చేసిన చిత్రం అమిగోస్ శుక్రవారం ప్రేక్షకుల మందుకు వచ్చింది. బింబిసారతో హిట్ట కొట్టిన కల్యాణ్ ఈ సినిమాలో పాత్రలకు తగ్గట్టుగా నటించారు. 

ఈ మూవీలో కల్యాణ్ రామ్(సిద్ధు)తన వారసత్వంగా వచ్చే బిజినెస్ చేస్తుంటాడు. అయితే అతని పెళ్లి వయస్సు రావడంతో ఇంట్లో వాళ్లు సంబంధాలు చూస్తుంటారు. అయితే సిద్ధుకు అమ్మాయిలు ఓ పట్టాన నచ్చరు. కొద్ది రోజుల తర్వాత ఇషిక (ఆషికా రంగనాథ్) ఆర్జేను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఈ క్రమంలో సిద్ధు తనలాగే ఉండే మరో ఇద్దరిని ఓ వెబ్ సైట్ ద్వారా కలుసుకుంటాడు. వారే మంజునాథ్ మైఖేల్.. సిద్ధు జీవితంలో వీరి వల్ల ఓ సమస్య వచ్చిపడుతుంది.

ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ అధికారులు మంజునాథ్‌పై కాల్పులు జరిపి.. అతన్ని తమ కస్టడీలోకి తీసుకుంటారు. అప్పుడే సిద్ధార్థ్‌కు మైఖేల్‌ గురించి  ఓ ఆసక్తికర విషయం తెలుస్తుంది. అసలు మంజునాథ్ ఎవరు? సిద్ధు జీవితంలోకి అతడి రాకతో ఎలాంటి సమస్యలు తలెత్తాయి? ఈ సమస్యల నుంచి సిద్ధు ఎలా బయటపడ్డాడనేది మిగతా కథ.

ఒకే పోలికలతో వున్న ముగ్గురి కథ ఇది. ఒకే పోలికలతో ఉన్న వ్యక్తులని డోపెల్‌గాంజర్స్ అంటారు. అయితే ఈ మాట కొందరికి కొత్తగా పరిచయం అవుతుందేమో కానీ ఇలాంటి కథలు మాత్రం హాలీవుడ్ వచ్చాయి.  ద్వితీయార్ధంలో మైఖేల్‌ ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ ప్రేక్షకులను మెప్పిస్తుంది. బిపిన్‌ రాయ్‌ అనే నరరూప రాక్షసుడిగా కల్యాణ్‌రామ్‌ను తెరపై చూపించిన విధానం బాగుంటుంది. ఇండియన్ పాబ్లో ఎస్కోబార్‌గా ఆ పాత్రని చాలా పవర్ ఫుల్‌గా పరిచయం చేశారు. అయితే దాన్ని కొనసాగించడంలో దర్శకుడిలో తడబాటు కనిపించింది.

పైగా, దర్శకుడు కథకి సహజంగా కాకుండా తనకి అనుకూలంగా చాలా సన్నివేశాలని రాసుకుంటూ వెళ్ళాడు. ఎన్ఐఎ ప్రవేశించిన ఓ కేసులో విచారణ చాలా పటిష్టంగా ఉంటుంది. కానీ వాళ్లు అసలు విచారించినట్లే కనిపించదని సినిమా విమర్శకులు చెబుతున్నారు. ఏదీ ఏమైనా.. సినిమాను ఒకసారి చూడచ్చని సూచిస్తున్నారు.



కామెంట్‌లు