రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 2019లో పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున ఏడాదికి రూ.6వేలు అందిస్తారు. ఇప్పటికే రైతుల బ్యాంకు ఖాతాలో 12 వ విడతలుగా డబ్బు జమ అయింది. త్వరలో 13వ విడత పైసాలు జమ కానున్నాయి. అయితే ఈ డబ్బు రావాలంటే అన్నదాతలు ఈకేవైసీ పూర్తు చేయాలి. లేకుంటే రైతుల ఖాతాలో డబ్బులు పడవు. కాగా ఈకేవైసీకి నేడు తుది గడువు విధించారు.
ఈకేవైసీ ఎలా చేయాలంటే
ముందుగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వెబ్ సైట్( https://pmkisan.gov.in/) కు వెళ్లాలి. వెబ్ సైట్ లో లెఫ్ట్ సైడ్ ఈ కేవైసీ(https://exlink.pmkisan.gov.in/aadharekyc.aspx) అని ఉంటుంది. దాని పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత రైతు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫోన్ నెంబర్ లింక్ అయి ఉన్న ఆధార్ నెంబర్ నే ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ సెల్ ఫోన్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. అప్పుడు ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు ఫోన్ కు మళ్లీ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సడ్మిట్ చేస్తే మీ ఈకేవైసీ పూర్తి అయినట్లే.ఒక వేళ మీ ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ కాకుంటే.. వెంటనే మీ దగ్గరలోని మీ సేవ సెంటర్ కు వెళ్లి ఫోన్ నెంబర్ ను ఆధార్ లింక్ చేయించుకోవాలి.
కొత్త రైతు ఎలా రిజిస్ట్రేష్ చేసుకోవాలంటే
పీఎం కిసాన్ పథకానికి కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే... కిసాన్ సమ్మాన్ నిధి వెబ్ సైట్ ( https://pmkisan.gov.in/)కు వెళ్లాలి. అందులో లెఫ్ట్ సైడ్ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్(https://pmkisan.gov.in/RegistrationFormNew.aspx) అని ఉంటుంది. దానిపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలి. మీ భూమి పాస్ బుక్, ఆధార్ నెంబర్, బ్యాంక్ పాస్, రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. కొన్ని పత్రాలను స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి. ఆ తర్వాత ఏఈవో దాన్ని పరిశీలిస్తారు. ఈ కేవైసీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి..

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి