Mahila Samman Saving Certificate 2023: మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్లో ఎలా పెట్టుబడి పెట్టాలటే.. !
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సందర్భంగా మహిళల కోసం ఓ ప్రత్యేక పొదుపు పథకాన్ని తీసుకొచ్చింది. అదే మహిళా వికాస్ పత్రా(మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్). ఈ పథకం 2023 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు అంటే రెండేళ్ల పాటు ఉంటుంది. ఈ పథకలంలో భాగంగా ఒక మహిళా లేదా ఒక బాలిక గరిష్ఠంగా రెండు లక్షల వరకు పొదుపు చేయవచ్చు. ఇందులో కేవలం రెండే పాటు మాత్రమే పొదువు చేయడానికి అవకాశం ఉంది.
మీరు 2023 ఏప్రిల్ లో నుంచి ఈ పథకంలో చేరవచ్చు. ఈ పథకంలో 7.5 శాతం వడ్డీ రేటు ఇస్తారు. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీం 8 శాతం ఇస్తుండగా.. సుకన్య సమృద్ధియోజనకు 7.6 శాతం ఇస్తున్నారు. అంటే ఈ రెండు పథకాల తర్వాత ఎక్కువ వడ్డి వచ్చే పథకం మహిళా వికాస్ పత్రా.. ఈ పథకంలో చేరిన వారు మధ్యలో వారి డబ్బును కొంత మొత్తం తీసుకోవచ్చు. ఎంత మొత్తం తీసుకోవచ్చో ఇంకా నిబంధనలు విడుదల చేయలేదు.
ఈ పథకానికి పన్ను మినహాయింపు ఉంటుందో లేదో ఇంకా ప్రకటించలేదు. కాగా మహిళా వికాస్ పత్రా పథకంలో చేరాలంటే 2023 ఏప్రిల్ 1 నుంచి మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ లేదా పోస్టాఫీస్ కు వెళ్లి ఈ పథకంలో చేరొచ్చు. కావాల్సిన పత్రాలు సమర్పించి, అప్లికేషన్ సర్పించి ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. మీరు డబ్బు డిపాజిట్ చేసిన తర్వాత మీకు సర్టిఫికెట్ కూడా ఇస్తారు. ఉదాహరణకు ఈ పథకంలో ఒక మహిళ రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే ఏడాదికి 7.5 శాతం చొప్పున రూ.16,125 వస్తాయి. రెండేళ్ల కాలనికి రూ. 31,125 వస్తాయి. అంటే మీరు రెండు లక్షల రూపాయాలు పెట్టిబడి పెడితే రెండళ్ల తర్వాత మీకు రూ.2.31 లక్షలు వస్తాయి.
Read More: మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి..?



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి