రెండో రోజు ఘనంగా లక్ష్మీ గణపతి వార్షికోత్సవ వేడుకలు

 


రెండో రోజు పారువెల్ల శ్రీ లక్ష్మీ గణపతి స్వామి 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు  తన్నీరు శరత్ రావు లక్ష్మీగణపతిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు గన్నేరువరం మండల పరిషత్ అధ్యక్షులు లింగాల మల్లారెడ్డి, నుస్తులాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు అలువాల కోటి, గ్రామ సర్పంచ్ తీగల మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కాంతాల విక్రం రెడ్డి, బొడ్డు సునీల్, మల్లేశం ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల రైతు బంధు సమితి కోఆర్డినేటర్ బద్దం తిరుపతి రెడ్డి,  ఆలయ కమిటీ అధ్యక్షులు బలరాం రెడ్డి, ఉపాధ్యక్షుడు చెక్కిళ్ల చంద్రయ్య గారు, PACS డైరెక్టర్ బద్దం  రాం రెడ్డి, చెక్కిళ్ల తిరుపతి గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.



కామెంట్‌లు