స్టేజీపైనే కన్నీరు పెట్టుకున్న సమంత...


 ప్రముఖ హీరోయిన సమంత కన్నీరు పెట్టుకుంది. ఆమె నటించిన చిత్రం ‘శాకుంతలం’ ఫిబ్రవరి 17న రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్ ఇవాళ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తోపాటు సమంత కూడా పాల్గొంది. చాలా రోజుల తర్వాత సమంత మీడియా ముందుకు వచ్చింది. అయితే ఈ ఈవెంట్ లో సమంత భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. దర్శకుడు గుణశేఖర్‌ మాట్లాడుతూ..ఈ సినిమాకు సమంత నిజమైన హీరో అంటూ కొనియాడారు. దీంతో ఆమె ఎమోషనల్‌ అయిపోయారు. కాగా సమంత  ప్రస్తుతం మయోసైటిస్‌ అనే వ్యాధి భాదపడుతోంది. దీనికి చికిత్స కూడా తీసుకుంటుంది. ఇప్పడిప్పుడే ఆమె ఈ వ్యాది నుంచి కోలుకుంటుంది.


కామెంట్‌లు