సింగర్ శ్రీరామ చంద్ర అసహనం వ్యక్తం చేశారు. ఓ పొలిటీషియన్ కోసం ఫ్లై ఓవర్ బ్లాక్ చేయడం వల్ల తనకు ఆలస్యం అవడంతో ఫ్లైట్ మిస్ అయ్యానని అన్నారు.
"ఒక ఈవెంట్ కోసం నేను గోవా వెళ్లాల్సి ఉంది. విమానాశ్రయానికి బయలుదేరిన నాకు ఫ్లై ఓవర్ బ్లాక్ చేసినట్లు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. ఒక రాజకీయ నాయకుడి కోసం ఇలా ఫ్లై ఓవర్‌ను బ్లాక్ చేశారు. దీంతో చుట్టూ తిరిగి ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో వాహనాల రద్దీ పెరిగి.. ట్రాఫిక్ ఆగిపోవడంతో నాకు ఆలస్యం అయింది. నేను గోవా వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్సయింది. ఇప్పుడు మరొక విమానంలో గోవా చేరుకోవడం కష్టమైన పని. నాతో పాటు 15మంది ఈ కారణంగానే ఫ్లైట్ మిస్సయ్యారు. రాజకీయ నాయకుల కోసం ఇలా చేయడం వల్ల మాలాంటి సామాన్యులు ఇబ్బందిపడుతున్నారు. దయచేసి దీని గురించి ఆలోచించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు.
ట్వీట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి