Horoscope Today: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉందంటే..!

 


గురువారం ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం.. 

2.

మేష రాశి

ఈ రాశి వారు వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో ఆచితూచి అడుగేస్తే మంచిది. మీ ప్రేమ జీవితంలో ఒక ఆహ్లాదకరమైన సమయం వస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో టెన్షన్ పెరగొచ్చు. ప్రారంభించబోయే పనులలో ఇబ్బందులు జాగ్రత్త పడాలి


3.

వృషభ రాశి

ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. కానీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మీ మీ రంగాల్లో రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాల్సి ఉంటుంది. సాయి బాబను గుడికి వెళ్తే మంచిది.


4.

మిథున రాశి

ఈ రాశి వారికి సకాలంలో పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు ఎక్కువగా ఖర్చు చేయొచ్చు. మీ ప్రేమ జీవితంలో ఏదో ఒక ఆందోళన ఉంటుంది. వివాహితులకు ఈరోజు ఆనందంగా ఉంటుంది.  ఆర్ధికంగా శుభఫలితాలు ఉన్నాయి. 


5.

కర్కాటక రాశి

ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ప్రభుత్వ అధికారి సహకారంతో ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మనోధైర్యాన్ని కోల్పోవద్దు.  ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడం అవసరం. 


6.

సింహ రాశి

రోజు విదేశాల్లో ఉన్న వారికి మంచి లాభాలు ఉంటాయి. మీ ఇంటి జీవితంలో ఒత్తిడితో కూడిన పరిస్థితులు తలెత్తొచ్చు. సంబంధాలను దృష్టిలో ఉంచుకుని తెలివిగా వ్యవహరించాలి. వారి సహకారంతో మీరు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు.ఉత్సాహంగా పనిచేస్తారు. ఎవరినీ అతిగా నమ్మకండి.


7.

కన్య రాశి

ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న సమాచారం ఒకటి అందుతుంది.

కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు.మీ భాగస్వామితో ఏదో ఒక విషయంలో పెద్ద గొడవలు వచ్చే అవకాశం ఉంది.


8.

తుల రాశి

ఈ రాశి వారికి కుటుంబంలో కొద్దిగా మనశ్శాంతి తగ్గుతుంది. ఎవరితోనూ వాదోపవాదాలకు దిగవద్దు. స్నేహితులతో కూడా అపార్ధాలు చోటు చేసుకుంటాయి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న సమాచారం ఒకటి అందుతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం పర్వాలేదు.


9.

వృశ్చిక రాశి

ఈ రాశి వారు  ఉద్యోగం మారటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అతి కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బంధువుల దగ్గర నుంచి డబ్బులు వసూలు అవుతాయి.  కొన్ని కీలక వ్యవహారాల విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. 


10.

ధనుస్సు రాశి

మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. సన్నిహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. కొద్దిగా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. 


11.

మకర రాశి

ఈ రాశి వారికి మీ ప్రేమ జీవితాన్ని అందంగా మార్చుకునేందుకు ప్రయత్ని్స్తారు. మీ కుటుంబ జీవితంలో ఉండే అపార్థాలన్నీ తొలగిపోతాయి. అధికారుల వద్ద అణిగిమణిగి ప్రవర్తించాల్సి ఉంటుంది. 

  

12.

కుంభ రాశి

మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలొస్తాయి. ఖర్చుల విషయంలో ఈరోజు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఒకరిద్దరు స్నేహితులకు సహాయం చేస్తారు. 


13.

మీన రాశి

ఈ  రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. త్మీయులు ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి.


కామెంట్‌లు