ప్రముఖ నిర్మాత దిల్ నిర్మిస్తున్న వరసుడు సినిమాపై వివాదం ముదురుతోంది. ఈ సినిమాను సంక్రాంతి విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. పండుగల సమయాల్లో డబ్బింగ్ సినిమాలు విడుదల చేయ్యొద్దని తెలుగు నిర్మాత లేఖ రాసింది. ఈ లేఖపై తమిళ సినీ దర్శకులు తీవ్రంగా మండిపడుతున్నారు. తాము కూడా తెలుగు సినిమాలు అడ్డుకుంటామని తమిళ డైరెక్టర్ సీమాన్ చెప్పారు.
దీంతో త మేం డబ్బింగ్ సినిమాలు అడ్డుకుంటామని చెప్పలేదని.. కేవలం ప్రాధాన్యత ఇవ్వాలని కోరామని తెలుగు సినీ నిర్మాతలు చెప్పారు. తాజాగా తమిళ పరిశ్రమ అభ్యంతరాలపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. సినిమాలను అడ్డుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. సినిమాలకు ఎలాంటి ఎల్లలు లేవని పేర్కొన్నారు. మంచి సినిమా ఎక్కడైనా నడుస్తుందని చెప్పారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి