అత్యంత విషమంగా సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం..!

సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర ఆరోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన కాంటినెంటల్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో  కార్డియాక్ అరెస్ట్ కావడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మల్టీ ఆర్గాన్ ఫెల్యూర్ తో ఉన్నట్లు తెలుస్తోంది. 48 గంటలు ఆగితే తప్ప కృష్ణ గారి ఆరోగ్యం క్లారిటీ వచ్చే అవకాశం లేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కృష్ణ వయస్సు 80 సంవత్సరాలు. ఈ మధ్యే ఆయన సతీమణి ఇందిరా దేవి కన్నుమూశారు. 


కామెంట్‌లు