ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్‍కు 40 సీట్లే..

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముందస్తుకు వెళ్లేందుకే కేసీఆర్ సర్వేలు చేయిస్తున్నారు. అయితే మునుగోడు ఫలితం తర్వాత కేసీఆర్ కొంత అసంతృప్తిగా ఉన్నారు. దాదాపు 150 మంది ప్రజాప్రతినిధులు ప్రచారం చేసినా టీఆర్ఎస్ కు వచ్చింది కేవలం 10 వేల మెజారిటీయే. ఇక్కడ వామపక్షాలు గులాబీ పార్టీకి మద్దతు ఇవ్వకుంటే పరిస్థితి వేరేలా ఉండేది. అందుకే కేసీఆర్ మునుగోడు ఉపఎన్నిక ఫలితం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించారని తెలుస్తోంది. 

అయితే ఈ సర్వే టీఆర్ఎస్ ప్రతికూలంగా ఉన్నట్లు తెలిసింది. మొత్తం 119 స్థానాల్లో టీఆర్ఎస్ 40 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేలినట్లు పలు కథనాలు వస్తున్నాయి. ఇక 30 నుంచి 35 స్థానాల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందట. ఈ స్థానాల్లో బీజేబీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ హోరహోరీగా తలపడే అవకాశం ఉందట. 30-35 స్థానాల్లో గట్టిగా కష్టపడితే టీఆర్ఎస్ గట్టే అవకాశం ఉందట.

ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీకి ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లు సర్వేలో తేలినట్లు సమాచారం.  ఖమ్మంలో టీఆర్ఎస్ 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందట. 8 స్థానాల్లో త్రిముఖ పోటీ ఉంటుందట. మహబూబ్ నగర్ విషయానికొస్తే గులాబీ పార్టీ 4 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని సర్వేలో తేలింది. 3 స్థానాల్లో కష్టపడితే గెలిచే అవకాశం ఉందట. 7 స్థానాల్లో త్రిముఖ పోటీ ఉంటుందని సర్వే చెబుతుంది.  ముఖ్యంగా టీఆర్ఎస్ కు కంచు కోటగా ఉన్న కరీంనగర్ ఆ పార్టీకి ఎదురు గాలి విస్తుందని తెలిసింది. 

కరీంనగర్ జిల్లాలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ 5 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందట. ఇక 6 స్థానాల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాసం ఉందట. కష్టపడితే 2 స్థానాల్లో గులాబీ పార్టీ గెలుస్తుందని సర్వే తేలినట్లు వార్తలు వస్తున్నాయి. నిజమాబాద్ లో టీఆర్ఎస్ 5 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందట. 4 సీట్లలో త్రిముఖ పోటీ ఉంటుందట. మెదక్ లో 5 స్థానాల్లో గెలిచే అవకాశం ఉండగా... 5 స్థానాల్లో త్రిముఖ పోటీ  ఉంటుందట.  రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గులాబీ పార్టీ 8 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందట. 3 స్థానాల్లో కష్టపడితే టీఆర్ఎస్ గెలుస్తుందట. 3 సీట్లలో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందట.

నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ 4 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందట. కష్టపడితే మరో 3 సీట్లు దక్కే అవకాశం ఉందట. ఇక 5 స్థానాల్లో త్రిముఖ పోటీ ఉంటుందట. వరంగల్ జిల్లాలో గులాబీ పార్టీ 5 స్థానాల్లో విజయం సాధంచే అవకాశం ఉంది. కష్టపడితే మరో 3 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందట. 4 సీట్లలో త్రిముఖ పోటీ ఉంటుందట. ఆదిలాబాద్ జిల్లా చూసుకుంటే టీఆర్ఎస్ 3 సీట్లలో గెలిచే ఛాన్స్ ఉందట. కష్టపడితే మరో 3 స్థానాలు దక్కే అవకాశం ఉందట. 5 స్థానాల్లో త్రిముఖ పోటీ ఉండనుందట. హైదరాబాద్ కు సంబంధి సర్వే ఫలితాలు రానుట్లు తెలుస్తుంది. ఈ  సర్వే ఆధారంగా కేసీఆర్ ముందస్తుకు వెళ్లే అవకాశం ఉందట.


 

కామెంట్‌లు