మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి..?




దేశంలో చాలా మంది పూర్తి రక్షణతో కూడిన వాటిల్లో పెట్టుబడి పెడతారు. పోస్టాఫీస్, బ్యాంక్ ఎఫ్డీ, ఎల్ఐసీ పథకాలు, పీపీఎఫ్ ల్లో పెట్టుబడి పెడతారు. కానీ కొంచె రిస్క్ తీసుకుని మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడితే మంచి రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో రిస్క్ ఉంటుందన్న విషయం మార్చిపొవద్దు. అయితే 5 నుంచి 10, 15 సంవత్సరాలు పెట్టుబడి పెట్టేవారికి మ్యూచవల్ ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో లాంగ్ టర్మ్ పెట్టుబడికి మ్యూచువల్ ఫండ్స్ సరిపోతాయన్నమాట.

1.ఏఎంసీ

ఈ మ్యూచువల్ ఫండ్లను ఏఎంసీలు నడిపిస్తుంటాయి. ప్రస్తుతం చాలా రకాల ఏఎంసీలు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్  అంటే ఒక ఏఎంసీ ఏర్పాట్ చేసి దానికి కొంత డబ్బు కేటాయిస్తారు. ఆ తర్వాత పలు రకాల మ్యూచువల్ ఫండ్ల తీసుకొస్తారు. వీటి ద్వారా పబ్లిక్ నుంచి డబ్బు సేకరించి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడతారు. మనం డబ్బు కట్టినందుకు మనకు యూనిట్లు కేటాయిస్తారు. దీనికి ధర ఉంటుంది. దాన్నే ఎన్ఏవి(NAV) నెట్ అసెట్ వ్యాల్యూ అంటారు. స్టాక్ మార్కెట్ హెచ్చుదగ్గలను బట్టి ఎన్ఏవి ధర మారుతుంటుంది. 

2.స్టాక్ మార్కెట్

మ్యూచువల్ ఫండ్స్ పెట్టిబడి పెట్టే బదులుగా డైరెక్ట్ గా స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టొచ్చుగా అని అంటారు. అయితే స్టాక్ మార్కెట్ డైరెక్ట్ గా పెట్టుబడి పెట్టాలంటే మనం చాలా నాలెడ్జ్ అవసరం. పైగా మనం కొనుగోలు చేసిన కంపెనీ పరిస్థితులను నిత్యం గమనిస్తూ ఉండాలి. అది కాకుండా మనకు స్టాక్ సెలక్షన్ రావాలి.. ఎప్పుడు ఎంటర్ కావాలి.. ఎప్పుడు  ఎగ్జిట్ కావాలో తెలిసుండాలి. ఇవన్నీ తెలియాలంటే మనం 24 గంటలు దీని పైనే వర్క్ చేయాలి. అదే మ్యూచువల్ ఫండ్లలో అయితే ప్రతి ఫండ్ కు ఒక మేనేజర్ ఉంటాడు. అతనికి స్టాక్ మార్కెట్, ఫైనాన్షియల్, ఆర్థిక వ్యవస్థం గురించి అంతా తెలిసి ఉంటుంది. అలా అయితేనా ఫండ్ మేనేజర్ గా నియమిస్తారు. ఒక వేళ ఫండ్ మేనేజర్ సరైన రిటర్న్స్ ఇవ్వకపోతే అతన్ని మారుస్తారు. 

3. ఎక్స్ పెన్స్ రేషియో 

మ్యూచువల్ ఫండ్ల వారు ఫ్రీగా సర్వీస్ ఎందుకు చేస్తారు అని అనుకుంటున్నారు కదా..  వారు ఫ్రీగా మనం కోసం పని చేయరు. మన డబ్బును స్టాక్ ల్లో పెట్టుబడి పెడుతున్నందకు డబ్బులు తసుకుంటారు. దాన్నే ఎక్స్ పెన్స్ రేషియో అంటాం. ఇది ఫండ్ ఫండ్ కు మారుతుంటుంది. అలాగే మనం పెట్టుబడి పెట్టిన సంవత్సరం లోపు డబ్బు వెనక్కి తీసుకుంటే ఎగ్జిట్ లోడ్ కూడా ఉంటుంది. ఇది కూడా ఫండ్ ఫండ్ కు మారుతుంటుంది.

4. డెట్, ఈక్విటీ

మ్యూచువల్ ఫండ్లలో రకాలు ఉంటాయి. అందులో ఒకటి డెట్ ఫండ్ కాగా మరొటి ఈక్విటీ ఫండ్ డెట్ కంటే ఈక్విటీలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రిస్క్ ఎక్కువ ఉన్నా రాబడి కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు నిపుణులను సంప్రదించి పెట్టుబడి పెట్టడం మంచిది. నెక్ట్స్ ఆర్టికల్ లో ఈక్విటీలో ఎన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయో చూద్దాం..


Note: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి రిస్క్ తో కూడుకున్నది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే ఇచ్చాం. 

కామెంట్‌లు